వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు, ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు.
ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు తక్షణమే హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ వార్త తెలియడంతో పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.










