భీమిలి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో రూ. 30 లక్షలతో నిర్మిస్తున్న ఆయుష్ శాఖ నూతన భవన పనులను జోనల్ ఉప సంచాలకులు డాక్టర్ కైపు శ్రీనివాసరావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
భవన నిర్మాణ నాణ్యతను పరిశీలించిన ఆయన, గోడలు మరియు పైకప్పు పనుల గురించి ఆరా తీశారు. ప్రజలకు ఉపయోగపడేలా కట్టడాలు అత్యంత నాణ్యంగా ఉండాలని, పనుల్లో ఎటువంటి లోపాలు ఉండకూడదని కాంట్రాక్టర్లను మరియు అధికారులను ఆదేశించారు.










