రాజంపేట పార్లమెంటు కార్యాలయం వద్ద టీడీపీ ప్రచార రథాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్ శనివారం ప్రారంభించారు.
మార్చి 2న జరగనున్న పార్లమెంటు పార్టీ అధ్యక్ష, కార్యదర్శుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు మార్గదర్శకత్వంలో ఈ ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఈ ఉత్సవాన్ని జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులు కోరాయి.










