పుంగనూరు తహసీల్దార్ రాము అధ్యక్షతన శుక్రవారం ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బి. నర్సింలు మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా అనుమతులు లేకుండా వెలుస్తున్న అక్రమ లేఅవుట్లపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారంపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
# కొత్తూరు మురళి.










