విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చొరవతో ఏ.కొండూరు మండలంలోని 38 గ్రామాలకు కృష్ణా జలాలు అందనున్నాయి.
జలజీవన్ మిషన్ కింద రూ. 50 కోట్లతో చేపట్టిన పైప్లైన్ పనులు, ట్యాంకుల నిర్మాణం పూర్తయ్యాయి. సుమారు 56 వేల మందికి ఇంటింటికీ స్వచ్ఛమైన నీరు అందించేలా ఏర్పాట్లు చేశారు.
మార్చి నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. కిడ్నీ వ్యాధి ప్రభావిత ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం లభించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.










