కొత్తనాగులూరులో ఆధ్యాత్మిక శోభ.. అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వసంత!

0
0

ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కొత్తనాగులూరులో జరుగుతున్న శ్రీ బాల ఆరేటమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ శనివారం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అమ్మవార్లను దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐదు రోజుల పాటు వైభవంగా సాగే ఈ ఉత్సవాల్లో ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.

ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.