ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు విజయనగరం జిల్లా చీపురుపల్లి పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి వర్చువల్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
దేశవ్యాప్తంగా 14-15 ఏళ్ల బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఇచ్చే ఉచిత హెచ్‌పీవీ (HPV) వ్యాక్సిన్ డ్రైవ్‌ను ప్రధాని ప్రారంభించనుండగా,
సీఎం చంద్రబాబు చీపురుపల్లి నుంచి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్నారు. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC) వద్ద ఇందుకోసం అన్ని రకాల సాంకేతిక మరియు వైద్య ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ రాం సుందర్ రెడ్డి తెలిపారు.










