డాక్టర్ సిరిల్ లారెన్స్‌పై విచారణ జరపాలి: బీరంగి రేవతి డిమాండ్

0
0

మదనపల్లె వెటర్నరీ వైద్యుడు డాక్టర్ సిరిల్ లారెన్స్ నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరపాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి బీరంగి రేవతి డిమాండ్ చేశారు.

వెటర్నరీ కౌన్సిల్ తనిఖీల్లో వెల్లడైన అవకతవకలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

బాధ్యతాయుతమైన పదవిలో ఉండి నిబంధనలు ఉల్లంఘించడం సరికాదని, ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించి పశువుల యజమానులకు న్యాయం చేయాలని స్పష్టం చేశారు.