నిజామాబాద్‌లో విషాదం: మౌలానా అబ్దుల్ రషీద్ మజ్లిస్ కన్నుమూత.

0
0

నిజామాబాద్ గాంధీ చౌక్ మస్జిద్-ఎ-కచియా ఇమామ్ మౌలానా అబ్దుల్ రషీద్ మజ్లిస్ గురువారం తుదిశ్వాస విడిచారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి పట్ల నగర ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నెహ్రూ పార్క్ సమీపంలోని ఖబ్రస్థాన్‌లో నిర్వహించిన నమాజ్-ఎ-జానాజాకు వేలాది మంది ప్రజలు హాజరై అశ్రునయనాల మధ్య ఆయనకు అంతిమ విడ్కోలు పలికారు.

దశాబ్దాల పాటు ఆయన అందించిన ధార్మిక సేవలను భక్తులు గుర్తుచేసుకున్నారు.