పుంగనూరు తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో దళిత సంఘాల నిరసన శుక్రవారం మూడో రోజుకు చేరుకుంది. మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్.ఆర్. అశోక్ మాట్లాడుతూ, స్థానిక దళితులకు కేటాయించిన ఇంటి స్థలాలను రెవెన్యూ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా బయటి వ్యక్తులకు (నాన్-లోకల్) కట్టబెట్టారని ఆరోపించారు.
అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
కొత్తూరు మురళి.










