పుంగనూరు శ్రీ కల్యాణ వేంకటరమణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం స్వామివారు రాజమన్నార్ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
టీటీడీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఊరేగింపులో కళాకారుల కోలాటాలు, సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
పట్టణ వీధుల్లో స్వామివారికి భక్తులు నీరాజనాలు పలికారు. కోనేటి పరిసరాలు గోవింద నామస్మరణతో మారుమోగాయి. ఈ వేడుకల్లో స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
# కొత్తూరు మురళి.










