పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్లలో గురువారం ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి చల్లా బాబు పంపిణీ చేశారు.
వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లబ్ధిదారులకు మొత్తం రూ. 12 లక్షల 70 వేల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
# కొత్తూరు మురళి.










