మదనపల్లె పట్టణంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వాల్మీకి వీధికి చెందిన రైతు లక్ష్మీనారాయణ (57) తీవ్రంగా గాయపడ్డారు.
ఆయన ప్రయాణిస్తున్న స్కూటర్‌ను శ్రీవారి బస్సు బలంగా ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే బాధితుడిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుండి కోలుకుంటున్నారు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, బస్సును స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.










