మెదక్ జిల్లాలో ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు: కలెక్టర్ ప్రతిమా సింగ్

0
0

మెదక్ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరగాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. నర్సాపూర్‌లోని మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఆమె స్వయంగా పరిశీలించారు.

విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, అత్యవసర మందులు మరియు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.


పరీక్షల నిర్వహణలో పారదర్శకత పాటిస్తూ,
నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.