లడ్డూ వివాదం ఒక పొలిటికల్ డ్రామా: వైసీపీ నేతల సంచలన వ్యాఖ్యలు.

0
0

విజయవాడలో మల్లాది విష్ణు ఆధ్వర్యంలో జరిగిన “నిజాల ఆవిష్కరణ” సదస్సులో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.

తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణలు కేవలం రాజకీయ కుట్రని, హెరిటేజ్ నెయ్యి విక్రయాల కోసమే ఈ డ్రామా ఆడారని మండిపడ్డారు.

గత వైసీపీ హయాంలోనే ఆలయాల అభివృద్ధి జరిగిందని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. మతాన్ని అడ్డం పెట్టుకుని భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని కూటమి నేతలను హెచ్చరించారు.