వేసవి కాలం – అగ్ని ప్రమాదాలు: విద్యార్థులే రేపటి రక్షకులు కావాలి.

0
0

మదనపల్లె పట్టణంలోని సొసైటీ కాలనీలో గల ఒక ప్రైవేట్ పాఠశాలలో గురువారం విద్యార్థులకు అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు.

అగ్నిమాపక అధికారి శివప్ప ముఖ్య అతిథిగా హాజరై, వేసవి కాలంలో పెరిగే ఉష్ణోగ్రతల వల్ల సంభవించే ప్రమాదాల పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎలా అప్రమత్తంగా ఉండాలో వివరించారు.

ప్రమాదం జరిగినప్పుడు భయపడకుండా, అందుబాటులో ఉన్న వనరులతో మంటలను ఎలా అదుపు చేయాలో ప్రయోగాత్మకంగా చూపించారు. ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడంలో ముందస్తు జాగ్రత్తలు కీలకమని ఆయన పేర్కొన్నారు.