Home South Zone Andhra Pradesh 15.76 లక్షల మంది ఓటర్లకు భరోసా.. కొత్తగా 122 పోలింగ్ స్టేషన్ల ప్రతిపాదన.

15.76 లక్షల మంది ఓటర్లకు భరోసా.. కొత్తగా 122 పోలింగ్ స్టేషన్ల ప్రతిపాదన.

0

విజయనగరం జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను పారదర్శకగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి (DRO) మురళి కోరారు.

గురువారం తన ఛాంబర్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న 15,76,018 మంది ఓటర్ల సౌకర్యార్థం, ప్రస్తుతమున్న 1,847 పోలింగ్ కేంద్రాలకు అదనంగా మరో 122 కొత్త పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆయన వివరించారు.

ఓటర్ల జాబితా సవరణ మరియు బూత్ స్థాయి పర్యవేక్షణ కోసం గుర్తింపు పొందిన అన్ని పార్టీలు వెంటనే బూత్ లెవల్ ఏజెంట్లను (BLA) నియమించుకోవాలని సూచించారు.

#BOIENA RAJESH

NO COMMENTS

Exit mobile version