53 మంది డ్రంకెన్ డ్రైవ్ నిందితులకు చుక్కలు.. రూ. 5.30 లక్షల ఫైన్.

0
0

విజయనగరం జిల్లాలో మద్యం తాగి వాహనాలు నడిపిన 53 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరందరినీ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, కోర్టు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున మొత్తం రూ. 5.30 లక్షల జరిమానా విధించినట్లు ఎస్పీ దామోదర్ గురువారం తెలిపారు.

ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో ఈ ఉల్లంఘనలు బయటపడ్డాయి. గత మూడు నెలల్లో మద్యం మత్తులో వాహనాలు నడిపి పట్టుబడిన సుమారు 110 మందికి జైలు శిక్ష కూడా పడిందని ఎస్పీ హెచ్చరించారు.

#B.RAJESH