ఏపీ హైకోర్టుకు తొలి మహిళా సీజే: జస్టిస్ లీసా గిల్ నియామకానికి గ్రీన్ సిగ్నల్!

0
0

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ నియమితులు కానున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం ఆమె పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

ప్రస్తుతం పంజాబ్-హర్యానా హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న ఆమె, త్వరలోనే అమరావతిలో బాధ్యతలు చేపట్టనున్నారు.

న్యాయపాలనలో జాప్యం నివారించేందుకు, ప్రస్తుత సీజే పదవీ విరమణకు ముందే కొలీజియం ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం విశేషం.