ఆసియాలోనే అతిపెద్దదైన మదనపల్లె టమాటా మార్కెట్‌లో ధరలు భారీగా పడిపోయాయి.
శుక్రవారం 74 వేల కిలోల దిగుబడి రాగా, గ్రేడ్-1 రకం 10 కిలోలు కేవలం రూ. 130కే అమ్ముడైంది. అన్‌సీజన్ ప్రభావంతో ధరలు తగ్గడంతో పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మార్కెట్ కార్యదర్శి జగదీష్ వెల్లడించిన వివరాల ప్రకారం, గ్రేడ్-2 ధర రూ. 100, గ్రేడ్-3 ధర రూ. 90గా నమోదైంది.










