తెలంగాణ విద్యా కమిషన్ నివేదికలో ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొనడాన్ని డీటీఎఫ్ మహబూబాబాద్ జిల్లా శాఖ తీవ్రంగా ఖండించింది.
ఇది ఉపాధ్యాయుల కృషిని తక్కువ చేయడమేనని జిల్లా అధ్యక్షుడు నెల్లుట్ల భాస్కర్ మండిపడ్డారు. పదోన్నతులను సీనియారిటీ ప్రాతిపదికన కాకుండా పారామీటర్ల ఆధారంగా ఇవ్వాలన్న ప్రతిపాదనను, హెచ్‌ఎం పోస్టుల్లో 50% నేరుగా నియామకం చేపట్టాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని, ప్రస్తుత సర్వీస్ రూల్స్‌నే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.










