బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 76వ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఆదివారం ఉదయం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ఆయన, నితీశ్ కుమార్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో దీర్ఘకాలం కొనసాగాలని ఆకాంక్షించారు.
భారత రాజకీయాల్లో అత్యంత అనుభవజ్ఞులైన నాయకులలో నితీశ్ ఒకరని, బీహార్ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రశంసించారు.










