ప్రజాప్రతినిధుల క్రీడా పోటీల్లో క్రికెట్ ఆడుతూ గాయపడిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు ఇటీవల ఎడమ చేతి మణికట్టుకు శస్త్రచికిత్స జరిగింది.
ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు. తన ఆరోగ్య పరిస్థితిని విచారించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినందుకు రఘురామకృష్ణరాజు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
