కాకినాడ జిల్లా వేట్లపాలెం సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ ప్రమాదంలో మృతుల సంఖ్య 23కు చేరింది. మందుగుండు పేలుడు తీవ్రతకు 5 కిలోమీటర్ల వరకు శబ్దం వినిపించగా, ఫ్యాక్టరీ పూర్తిగా ధ్వంసమైంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘటనా స్థలాన్ని సందర్శించి, మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల రాష్ట్ర పరిహారం ప్రకటించారు.
కేంద్రం తరఫున ప్రధాని మోదీ మరో రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. భద్రతా నిబంధనల ఉల్లంఘనపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశించారు.










