ప్రభుత్వం మేల్కొని ప్రజలకు వైద్యం అందించాలి

0
0

కూటమి ప్రభుత్వం మేల్కొని ప్రజలకు వైద్య సేవలు అందించాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. శనివారం విజయనగరంలో విలేకర్లతో మాట్లాడుతూ..

ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం అందక ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని ఆరోపించారు. రాజమండ్రిలో కల్తీ పాల వల్ల జరిగిన సంఘటన, పలు సంఘటనలను ప్రస్తావనకు తెచ్చారు.

కల్తీ విషయంలో ప్రభుత్వం తగు చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు.

#Boiena Rajesh