శంఖవరం మండలం శంఖవరం గ్రామంలో ప్రతి ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన కుట్టు మిషన్ సృష్టికర్త “విలియమ్స్ హో” జయంతిని టైలర్స్ డే గా జరుపుకుంటారు దర్జీలు. తమ జీవితాలకు దారి చూపిన ఆయన జయంతిని మండల కేంద్రమైన శంకవరంలో దర్జీలు శనివారం ఘనంగా జరుపుకున్నారు.
విలియమ్స్ హో చిత్రపటానికి టైలర్స్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శివ దుర్గ టైలర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు, దర్జీలు ఆధరవ్యంలో కేక్ కట్ చేయించడం జరిగింది. టైలర్ సభ్యులు స్వీట్లు, కేకులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా దర్జీలు మాట్లాడుతూ రడీమేడ్ రంగం వేగవంతం కావడంతో దర్జీలకు పనులు దొరకని పరిస్థితి ఏర్పడిందని, ఈ కూటమి ప్రభుత్వం స్పందించి దర్జీలకు రుణాలు మంజూరు చేసి వృత్తి కొనసాగించేలా ప్రోత్సహించాలని, మా కుటంబాలలో జీవనోపాధి పెంచి వెలుగులు నింపాలని కోరారు.
#dadala babji










