వేట్లపాలెం బాణసంచా దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతా ప్రమాణాల పర్యవేక్షణలో విఫలమైనందుకు గాను పెద్దాపురం ఆర్డీఓ (RDO), సంబంధిత డీఎస్పీ (DSP), జిల్లా కార్మిక శాఖ అధికారి, మరియు జిల్లా అగ్నిమాపక అధికారిని తక్షణమే సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ప్రా్రాథమిక నివేదిక ఆధారంగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై ఈ చర్యలు తీసుకున్నట్లు సీఎం తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని స్పష్టం చేశారు.










