పుంగనూరు: టెంపో – బైక్ ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

0
0

శనివారం రాత్రి పుంగనూరు మండలం ఉలవలదిన్నె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుంగనూరు నుంచి కమతంపల్లి వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న టెంపో బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వెంకటరెడ్డి (45), విశ్వనాథ్ (55)లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని వెంటనే 108 వాహనంలో ఏరియా ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు# కొత్తూరు మురళి.