అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, చింతపర్తి గ్రామపంచాయతీ పరిధిలోని దిగువ గొల్లపల్లి సమీపంలో రైతు గంగిరెడ్డి సాగు చేస్తున్న చామంతి పూల తోటను శనివారం అన్నమయ్య కలెక్టర్ నిశాంత్ కుమార్ పరిశీలించారు.
ఈ సందర్భంగా రైతు పంట సాగు విధానం, పూల దిగుబడి, స్థానిక మార్కెట్లతో పాటు సమీప పట్టణాలకు పూల విక్రయాల గురించి కలెక్టర్కు వివరించారు. పూలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో రైతులు ఆధునిక సాగు పద్ధతులు అవలంబించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు
# కొత్తూరు మురళి.










