పుంగనూరులో శ్రీకళ్యాణ వేంకటరమణ స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం శ్రీవారు మత్స్యావతారంలో సూర్యప్రభ వాహనంపై పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
మహిళలు కర్పూర హారతులు సమర్పించగా, కోలాటాలు, చెక్క భజనలు, అన్నమయ్య కీర్తనలు, వాయిద్యాలతో కనువిందు చేశారు. టీటీడీ అధికారులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు
# కొత్తూరు మురళి.










