పోలీసుల చొరవ: ఏడాది క్రితం తప్పిపోయిన వ్యక్తి క్షేమంగా ఇంటికి!

0
0

మతిస్థిమితం కోల్పోయి ఏడాది క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన **పులగోర వేదమూర్తి (38)**ని వేటపాలెం పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

చిన్నగంజాం అంబేద్కర్ కాలనీకి చెందిన వేదమూర్తి వేటపాలెం పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

ఆయన చెప్పిన వివరాల ఆధారంగా బంధువులకు సమాచారం అందించి, ధృవీకరణ అనంతరం అప్పగించారు. ఏడాది తర్వాత తమ వ్యక్తి క్షేమంగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

#Narendra