మదనపల్లి మండలం కాశీరావుపేట మలుపు వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రెడ్డిప్రసాద్ (22) అనే యువకుడు తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్ళినట్లు వారి బంధువులు సోమవారం తెలిపారు.
సీటీఎంకు చెందిన ఇతను బైక్‌పై వాయల్పాడు నుండి వస్తుండగా, ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కింద పడిపోయాడని సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.










