Alipiri Walkers: తిరుపతిలో వాకర్స్ రాస్తారోకో .. భక్తులకు తీవ్ర ఇబ్బందులు.

0
0

తిరుపతి అలిపిరిలో వాకర్స్ చేపట్టిన రాస్తారోకోతో ఉద్రిక్తత నెలకొంది. దివ్యరామంలో వాకింగ్ కోసం నెలకు రూ.100 రుసుము వసూలు చేయాలన్న అటవీశాఖ నిర్ణయానికి వ్యతిరేకంగా వాకర్లు రోడ్డుపై నిరసనకు దిగారు.

దీంతో కిలోమీటరు మేర తిరుమల వాహనాలు నిలిచిపోయి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలిపిరి పోలీసులు రంగంలోకి దిగి వాకర్లతో చర్చలు జరపడంతో ఆందోళన విరమించారు. అనంతరం ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.