మదనపల్లి నుండి కదిరి క్షేత్రానికి ‘సుదర్శన సేన’ పాదయాత్ర.

0
1

కదిరి పౌర్ణమి మహోత్సవాలను పురస్కరించుకుని, మదనపల్లికి చెందిన సుదర్శన సేన సభ్యులు ఆదివారం పాదయాత్రను ప్రారంభించారు.

పట్టణంలోని అనపగుట్ట శ్రీవారినగర్‌లో ఉన్న శ్రీ అభయ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మాలాధారణ చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, కదిరి కంకణాలు ధరించి, స్వామివారి నామస్మరణతో భక్తులు కాలినడకన కదిరి క్షేత్రానికి బయలుదేరారు. వీరు మార్చి 3న జరిగే కదిరి పౌర్ణమి వేడుకల్లో పాల్గొంటారు.