తిరుమల లడ్డూ నాణ్యతపై జరుగుతున్న ప్రచారం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందంటూ డీఎస్పీ నాగవరప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
సెలవులో ఉన్న ఆయన తుళ్లూరు పోలీసులకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌పై ఫిర్యాదు చేశారు.
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి వ్యవస్థీకృత నేరానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. తాను స్వచ్ఛంద పదవీ విరమణకు సిద్ధమైనట్లు తెలిపిన ఈ అధికారి ఫిర్యాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.










