ఆనందంగా హోలీ పండుగ

0
0

విశాఖపట్నం: జిల్లావ్యాప్తంగా హోలీ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. నగరంలోని మహారాణిపేట, జగదాంబ, సీతమ్మధార, ఎంవీపీ కాలనీ వంటి ప్రాంతాలతో పాటు.

రూరల్ ఏరియాలైన మధురవాడ, భీమిలి, ఆనందపురం ప్రాంతాల్లో యువత, చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు. మధ్యాహ్నం 3 గంటల వరకు రంగుల ఆటతో సందడి చేసిన ప్రజలు, ఆ తర్వాత చంద్ర గ్రహణం ప్రారంభం కావడంతో ఇళ్లకు చేరుకున్నారు.

3:15 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు గ్రహణ సమయం కావడంతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. గ్రహణ ప్రభావం ఉన్నప్పటికీ, ఈ ఏడాది హోలీని భారతీయుల ఆచార వ్యవహారాల ప్రకారం విశాఖవాసులు ఘనంగా జరుపుకున్నారు.