దోర్నాలలో అంగన్‌వాడీల రాస్తారోకో.. అక్రమ అరెస్టులపై సిఐటియు ఆగ్రహం.

0
0

అంగన్‌వాడీల అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దోర్నాలలో ర్యాలీ నిర్వహించి, అనంతరం నటరాజ్ సెంటర్‌లో రాస్తారోకో చేపట్టారు.

ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు జి. మల్లయ్య మాట్లాడుతూ.. అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ. 26,000/- ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీతాల పెంపు కోసం శాంతియుతంగా పోరాడుతున్న మహిళలను అక్రమంగా అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమని, ఇది కూటమి ప్రభుత్వం చెబుతున్న ‘మహిళా సాధికారత’కు విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

తక్షణమే అరెస్టయిన వారిని విడుదల చేయాలని, వేతనాల పెంపుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.