మదనపల్లె: హత్యాయత్నం కేసులో ముగ్గురి అరెస్ట్.

0
1

మదనపల్లె మండలం దేవతానగర్ వద్ద గత నెల 25న ముగ్గురు వ్యక్తులపై కర్రలతో దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.

పాత కక్షల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు.

ఈ కేసులో భూపతి, నాగభూషణం, గౌతమ్ కుమార్ అనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.