చీరాల: వేటపాలెం మండల పరిధిలోని రేషన్ దుకాణాలపై బుధవారం రెవెన్యూ డివిజనల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మొత్తం ఎనిమిది రేషన్ దుకాణాలను పరిశీలించగా, ఆరు దుకాణాల్లో నిర్దేశిత పరిమితిని మించిన నిల్వలు ఉన్నట్లు గుర్తించారు.నిబంధనలకు విరుద్ధంగా అదనపు స్టాక్ నిల్వ ఉంచిన ఆరు దుకాణాలపై కేసులు నమోదు చేసి, సంబంధిత దుకాణాలను సీజ్ చేశారు.
ప్రజలకు సరఫరా చేయాల్సిన నిత్యావసర వస్తువుల విషయంలో ఎలాంటి అక్రమాలు సహించబోమని అధికారులు స్పష్టం చేశారు.ఈ తనిఖీలలో ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు, వేటపాలెం తహసీల్దార్ గీతారాణి, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ మరియు రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.
చీరాల మండల గ్రామ రెవెన్యూ అధికారులు కూడా తనిఖీలకు సహకరించారు.ప్రజల హక్కులను పరిరక్షించేందుకు అధికారులు చేపట్టిన ఈ చర్యలపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
#Narendra










