కోడలు పంపించిందని చెప్పి బంగారం చోరీ

0
0

బొబ్బిలి మున్సిపాలిటీలోని మల్లమ్మపేటలో నివాసముంటున్న కె.బంగారం మెడలో ఉన్న 2 తులాల బంగారం పుస్తెలతాడును గుర్తు తెలియని మహిళ అపహారించుకుపోయింది. వృద్ధురాలి పెద్ద కోడలు టైలర్ షాపులో పని చేస్తోంది.

తన కోడలు పంపించిందని వృద్ధురాలిని పరిచయం చేసుకున్న మహిళ మెడలో ఉన్న పుస్తెలతాడును అపహారించింది.
దీంతో రెండో కుమారుడు సాయిబాబు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ రమేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

#Boiena Rajesh