అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ సమీపంలో మంగళవారం రాత్రి పాత కక్షలతో ప్రసాద్ (41) అనే వ్యక్తిపై దుండగులు దాడి చేశారు. ఈ గొడవను ఆపడానికి ప్రయత్నించిన వైసీపీ మాజీ మేదరసం కార్పొరేషన్ డైరెక్టర్ తాలే సుబ్బుపై కూడా కత్తితో దాడి జరిగినట్లు సమాచారం.
ఈ ఘటనలో గిరీష్, షఫీ, ముని, మస్తాన్, ఫరీద్ డాడీ పాల్గొన్నారని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.










