ఆక్సిజన్ ప్లాంట్ల వద్ద కార్ల పార్కింగ్ – పొంచి ఉన్న ప్రమాదం.

0
0

మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఆసుపత్రిలోని భారీ ఆక్సిజన్ ప్లాంట్ల వద్ద నిబంధనలకు విరుద్ధంగా కార్లను పార్కింగ్ చేస్తున్నారు.

మండుతున్న ఎండల్లో పెట్రోల్ వాహనాలు పేలిపోయే ప్రమాదం ఉన్నా, ఆసుపత్రి పర్యవేక్షకులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి వాహనాల పార్కింగ్‌ను నిలిపివేయాలని స్థానికులు కోరుతున్నారు