బుధవారం సాయంత్రం పుంగనూరు మండలం భీమగానిపల్లి సర్కిల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని కంటైనర్ ఢీకొంది. ఈ ఘటనలో చౌడేపల్లి వైపు వెళ్తున్న నాగేశ్వరరావు, అనసూయ అనే ఇద్దరు గాయపడ్డారు.
వారిని స్థానికులు 108 వాహనంలో పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనసూయ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు
# కొత్తూరు మురళి.










