మదనపల్లె కోటబడి హైస్కూల్లో బాలికలకు కరాటే శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా శక్తి టీమ్ ఇన్చార్జ్ ఎస్సై గాయత్రి మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో ఆడపిల్లలు ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవడం ఎంతో అవసరమని తెలిపారు.
కరాటే మెలకువలు తెలిస్తే విపత్కర పరిస్థితుల్లో ధైర్యంగా ఎదుర్కోవచ్చని విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్లు, శక్తి టీమ్ సభ్యులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










