అన్నమయ్య జిల్లా: బాణసంచా కేంద్రాల మూసివేతకు ఎస్పీ ఆదేశం.

0
0

కాకినాడ జిల్లాలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో, జిల్లాలోని టపాసుల తయారీ మరియు విక్రయ కేంద్రాలపై ఎస్పీ ధీరజ్ కఠిన ఆంక్షలు విధించారు. బుధవారం ఆయన ఆదేశాల మేరకు, తనిఖీలు పూర్తయ్యే వరకు ఈ కేంద్రాలను మూసివేయాలని సూచించారు.

లైసెన్సులు, సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాలు లేని కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజల ప్రాణరక్షణ తమ ప్రథమ కర్తవ్యమని ఎస్పీ స్పష్టం చేశారు.
అక్రమ నిల్వలు ఉంటే వెంటనే డయల్ 112కు తెలియజేయాలని ప్రజలను కోరారు.