దౌర్జన్యకారులను అరెస్టు చేయాలి: సామర్లకోట మండల ఘటనపై నిరసన.

0
0

సామర్లకోట మండలం బోయనపూడి గ్రామంలో మాదిగలపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని ఎమ్మార్పీఎస్ (MRPS) నాయకులు డిమాండ్ చేశారు. మాదిగలపై దౌర్జన్యం చేసి, కులం పేరుతో దూషించిన అగ్రవర్ణాల వారిపై కఠిన చర్యలు తీసుకుని వెంటనే అరెస్టు చేయాలని కోరారు.
ఈ మేరకు ఎమ్మార్పీఎస్ జిల్లా మరియు రాష్ట్ర సీనియర్ నాయకులు సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.

బోయనపూడి గ్రామంలో జరిగిన ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దళితులపై జరిగే అన్యాయాలను ప్రభుత్వం కఠినంగా అరికట్టాలని పేర్కొన్నారు. కుల వివక్షకు పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాదిగ ఎమ్మెల్యే ఎంఎల్ఎఫ్ కొండేపూడి ఉదయ్ కుమార్, మందపల్లి సత్యనారాయణ మాదిగ, కొడతా విజయ్ కుమార్ మాదిగ, కొమ్ము చిన్న బాబు మాదిగ, తాతపూడి అప్పారావు మాదిగ తదితరులు పాల్గొన్నారు.