జనాభా నిర్వహణపై చంద్రబాబు విజన్: ఏపీలో కొత్త పాపులేషన్ పాలసీ.

0
0

ఆంధ్రప్రదేశ్‌లో పడిపోతున్న జననాల రేటుపై సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపై రాష్ట్రంలో ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్’ విధానం అమలు చేస్తామని, ఇందుకోసం కొత్త ముసాయిదా పాలసీని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2047 నాటికి రాష్ట్రం వృద్ధులమయం కాకుండా ఉండాలంటే జనాభా పెరుగుదల అవసరమని పేర్కొన్నారు.

సంతాన సమస్యలున్న వారికి ప్రభుత్వమే ఐవీఎఫ్ సదుపాయం కల్పిస్తుందని, ఈ పాలసీపై నెల రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని వెల్లడించారు.