మహిళా భద్రతపై అవగాహన: మదనపల్లిలో భారీ 2కే వాకథాన్.

0
0

మదనపల్లిలో మహిళా భద్రతపై అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారీ ‘2కే వాకథాన్’ నిర్వహించనున్నట్లు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు.

ఆదివారం ఉదయం 7 గంటలకు బీటీ కళాశాల మైదానం నుంచి చైతన్య యాత్ర ప్రారంభమవుతుంది. మహిళలు ఇంట్లో ఎంత సురక్షితంగా ఉంటారో, బయట కూడా అంతే ధైర్యంగా తిరిగేలా భరోసా కల్పించడమే ఈ నడక లక్ష్యం.

సుమారు 5 వేల మంది విద్యార్థినులు, గృహిణులు, ఉద్యోగినులు పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ను కూడా ప్రారంభించారు.