మంచిర్యాల శుభ్రత – ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత

0
0

మంచిర్యాల 32వ డివిజన్‌లో “శుభ్రత – ఆరోగ్య భద్రత” కార్యక్రమం ఘనంగా జరిగింది. కలెక్టర్ కుమార్ దీపక్, మేయర్ దర్ని మధుకర్ రామ్ నగర్‌లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

పారిశుధ్యం, వీధి దీపాలు, తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మేయర్ కోరారు.