మదనపల్లె మార్కెట్‌లో శుక్రవారం టమాటా ధరలు భారీగా పడిపోయాయి. రైతులు దాదాపు 70 మెట్రిక్ టన్నుల దిగుబడిని తీసుకురాగా, వ్యాపారులు మొదటి రకం 10 కిలోల బాక్స్‌ను రూ. 110 కి, రెండో రకం బాక్స్‌ను రూ. 90 కి కొనుగోలు చేశారు.
పెట్టుబడి కూడా రాని పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ధరలు పడిపోయినప్పుడు ప్రభుత్వం ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.










